20 June, 2026 | 2:38 AM

బాధితుడికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

20-06-2026 12:28 AM

మేడ్చల్ అర్బన్ జూన్ 19 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు-కిస్టాపూర్ 298 వ డివిజన్ పట్టణ పరిధిలోని అత్వెల్లికి చెందిన మండల కేశవ్ కు మంజూరైన 30 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మేడ్చల్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టి ఎమ్మెల్యే మాజి మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా అందజేసినట్లు బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మండల ఈశ్వరయ్య తెలియజేశారు.

ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ మేడ్చల్ నియోజవర్గ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రోత్సాహంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ యూత్ సీనియర్ నాయకులు మండల రవికుమార్.లబ్ధిదారులు మండల అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.