5 August, 2026 | 1:12 AM

సీఎంఆర్‌ఎఫ్ నిరుపేదలకు వరం

05-08-2026 12:07 AM

రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు.

నకిరేకల్‌కు ఇప్పటివరకు 23 కోట్ల సాయం

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం

కట్టంగూర్, ఆగస్టు 4: సీఎం సహాయనిది నిరుపేదలకు వరమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నకిరేకల్ లోని పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయం లో రామన్నపేట, చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూర్, నకిరేకల్ మండలాలకు చెందిన 256 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు నకిరేకల్ నియోజకవర్గానికి రూ. 23 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు. పేదల సంక్షేమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 200 కోట్లతో ఇంగ్రే టెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.

గత 10 ఏళ్ల పాలనలో ప్రజలకు ఎలాంటి సబ్సిడీలు, సంక్షేమ ఫలాలు అందలేదని విమర్శించారు. కడపర్తి సమీపంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని,తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. నకిరేకల్ పట్టణంలో ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత పాఠశాల ఏర్పాటు చేశామని చెప్పారుమొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, నిర్మాణాలు పూర్తయ్యాయని, రెండో విడతలో మరో 2,000 ఇళ్లు మంజూరయ్యాయని, వాటిని అర్హులకు అందజేస్తామని పేర్కొన్నారు.

గత పదేళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని, ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంచామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు మహిళలను కోటీశ్వరుడు చేసేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. బీఆర్‌ఎస్ నాయకులు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడటం లేదని ఆరోపించారు.ఈ కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు, 5 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.