26 June, 2026 | 1:47 AM

నితిన్ వరంగల్ పర్యటనను విజయవంతం చేయాలి

26-06-2026 12:00 AM

వెంకటాపూర్, జూన్ 25 (విజయక్రాంతి): ఈ నెల 29న వరంగల్ కు రానున్న భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనను విజయవంతం చేయాలని భాజపా మాజీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో భాజపా మండల అధ్యక్షుడు పైడాకుల మల్లేష్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర పర్యటన చేపడుతున్నారని తెలిపారు.

జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా తెలంగాణకు, అందులోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు రావడం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా వరంగల్ లో జరిగే సమావేశానికి మండలం నుంచి బీఎల్‌ఏ-2 లు, బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో భాజపా సీనియర్ నాయకులు యాదగిరి గౌడ్, తిరుపతి రెడ్డి, రాజ్ కుమార్, దేవేందర్, శ్రీనివాస్, రాజు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.