calender_icon.png 4 December, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు గొప్ప ఆర్థిక భరోసా సీఎంఆర్‌ఎఫ్

04-12-2025 12:00:00 AM

పీఎసీ చైర్మన్ గాంధీ

శేరిలింగంపల్లి, డిసెంబర్ 3 (విజయక్రాంతి) : మియాపూర్  డివిజన్ పరిధిలోని నాగార్జున ఎనక్లేవ్ కాలనీ కి చెందిన భాగ్యమ్మ దమనికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా సీఎంఆర్‌ఎఫ్ సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 2,50,000/- రెండు లక్షల యాబై వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ బుధవారం తన నివాసంలో బాధితీరాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయినేనీ చంద్రకాంత్ రావు, చంద్ర మోహన్ సాగర్, ఆనంద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.