04-12-2025 12:00:00 AM
మిర్యాలగూడ, డిసెంబర్ 3 (విజయక్రాంతి): వికలాంగుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని విహెచ్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి అహ్మద్ ఖాన్, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు దైవ సత్యం మాదిగ, ఎంసిపిఐ రాష్ట్ర నాయకులు వస్కుల మట్టయ్య లు కోరారు. బుధవారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో కేక్ కోసి మొక్కలు నాటి మాట్లాడారు. వికలాంగులకు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయంగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ప్రత్యేక నిధి కేటాయించి వారికీ అవసరం అయిన ఉపకరణాలు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రకటించిన ప్రకారం వికలాంగులకు 6 వేలు, వృద్ధులకు 4 వేలు పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ పోలేపల్లి సురేందర్, పట్టణ అధ్యక్షులు దైద శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు రాజ్ కుమార్, జోజి సైదులు, గోవిందయ్య, మల్లయ్య యాదవ్, రాకేష్ యాదవ్, బాలకృష్ణ, నర్సింహా, దైద సంజయ్, ఆంజనేయులు, పోతుగంటి కాశి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీఏ కార్యాలయం లో మొక్కలు నాటారు.