17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

జూలై మొదటి వారంలో జాతీయ రహదారుల దిగ్బంధం

25-06-2025 01:35 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ 

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల  ఉద్యమాన్ని ఉధృతం చేసేలా జూలై మొదటి వారంలో రాష్ర్టవ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్భందిస్తా మని, రాష్ర్టంలో ఎక్కడికక్కడ బీసీ ద్రోహుల పార్టీ కార్యాలయాలను ముట్టడించి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచే అధికారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, రాష్ర్టంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని బీజేపీ నేతలు రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని, బీసీల విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణిని పాటిస్తుందని శ్రీనివాస్ గౌడ్  మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.

ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని’ డిమాండ్ చేశారని.. తమిళనాడు రాష్ర్ట తరహాలోనే కేంద్ర ప్రభు త్వం బీసీ రిజర్వేషన్లును 9వ షెడ్యూల్‌లో చేర్చి అమలు చేయాల్సి ఉంటుందని తెలిసి కూడా ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా బీసీలను మోసం చేసే విధంగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.