13 April, 2026 | 10:04 AM

దేవరకద్ర అభివృద్ధికి సీఎం కృషి అభినందనీయం

02-07-2025 01:27 AM
  1. సీఎం రేవంత్ రెడ్డికి  ప్రజలు రుణపడి ఉంటారు

బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

ముషీరాబాద్, జూలై 1 (విజయక్రాంతి) : దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. మంగళవారం బషీర్బాగ్‌లో ఆయన  మీడియాతో  మాట్లాడారు. దేవరకద్ర నియోజకవర్గం 16 ఏళ్ల కిందట ఏర్పడినప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, గత బిఆర్‌ఎస్ ప్రభు త్వంలో దేవరకద్రను గాలికి వదిలేశారని అన్నారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధిలో పరుగులు పెడుతుందని అన్నారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధి కోసం 110 కోట్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 200 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. దేవరకద్రంలో 100 పడకల ఆసుపత్రి, కొత్తకోటలో 50 పడకల ఆసుపత్రి మంజూరుతో పాటు దేవరకద్రలో డిగ్రీ కళాశాల కూడా మంజూరు చేశారన్నారని అన్నారు.

తాజాగా దేవరకద్రకు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. త్వరలో నియోజవర్గ కేంద్రానికి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాల యం కూడా రాబోతున్నాయని తెలిపారు. కొత్తకోటలో డిగ్రీ కళాశాల తో పాటు అన్ని మండల కేంద్రాల్లో ప్రభు త్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మహ బూబ్‌నగర్ జిల్లాకు ట్రిబుల్ ఐటి మంజూ రు చేసి సీఎంకు ఈ ప్రాంతంపై ఉన్న మక్కువను చాటారన్నారు. సీఎం ప్రత్యేక చొరవతో, ఎమ్మెల్యే కృషితో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ కూడా దేవరకద్రలో ఏర్పాటు చేయబోతున్నారని తెలిపారు.

గత పదేళ్లలో పేదలకు రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వకుండా కెసిఆర్ మోసం చేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి వనపర్తి జిల్లా అధ్యక్షులు గూడూషా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గోటూరి రవీందర్ గౌడ్,  రేనట్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.