17 April, 2026 | 8:57 AM

బొగ్గు ఉత్పత్తి ఆగకుండా చూసుకోవాలి

04-06-2025 01:24 AM

వర్షాకాలం నేపథ్యంలో సింగరేణి సీఎండీ బలరాం ఆదేశాలు

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి ఆగకుండా చూడాలని, అందుకే ఇప్పటినుంచే ఓసీ గను ల్లో వర్షపు నీటిని తోడేందుకు అవసరమైన పంపులను సిద్ధంగా ఉంచాలని సింగరేణి సీఎండీ బలరాం అధికారులను ఆదేశించారు.

రోజుకు 2.15లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.45 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపాలని, భూగర్భ గనుల నష్టాల తగ్గింపునకు అధ్యయనం చేయాలని సూచించారు.

సింగరేణి డైరెక్టర్లు, ఏరియా మేనేజర్లతో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో సీఎండీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో ఉత్పత్తి ఏమాత్రం ఆగ కుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.