calender_icon.png 29 June, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈ ఫలితాల్లో ‘నారాయణ’ డామినేషన్

04-06-2025 01:22:24 AM

  1. ఆలిండియా టాప్ 10 ర్యాంకుల్లో 5 నారాయణవే

ఓపెన్ క్యాటగిరీలో ఆలిండియా టాప్ 50 లోపు 23 ర్యాంకులు, టాప్ 100లో 43 ర్యాంకులు

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తాచాటారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో మాజిద్ హుస్సేన్ (హెచ్.నం: 251134112) 3వ ర్యాంక్, పార్ట్ మందర్ వార్థక్ (హెచ్.నం: 251110752) 4వ ర్యాంకు, అక్షత్ చౌరాసియా (హెచ్.నం: 254065055) 6వ ర్యాంక్, సాహిల్ డియో (హెచ్.నం: 251113172) 7వ ర్యాంక్, వడ్లమూడి లోకేష్ (హెచ్.నం: 256061276) 10వ ర్యాంక్‌తో టాప్ 10 ర్యాంకుల్లో 5 ర్యాంకులు నారాయణ కైవశం చేసుకుంది.

ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 17, 20, 21, 22, 23, 27, 29, 30, 31, 34, 37, 38, 40, 43, 44, 46, 49, 50, 51, 52, 53, 54, 56, 57, 58, 63, 64, 73, 76, 77, 80, 82, 83, 85, 87, 88, 91, 98 వంటి టాప్ 100లోపు 43 ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూరనారాయణ, పీ శరణినారాయణ తెలిపారు.

అలాగే ఆలిండియా అన్ని కేటగిరీల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 1, 2, 2, 2, 4, 5, 7, 8, 10, 10 వంటి 10 లోపు 10 ర్యాంకులు, 50 లోపు 42 ర్యాంకులు, 100 లోపు 75 ర్యాంకులను కైవసం చేసుకుని ఐఐటీ ఆశయాలను సాకారం చేయటంలో వేరెవ్వరూ నారాయణకు సాటిలేరని, సాటిరారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 1,80,000 మందికి పైగా విద్యార్థులు పోటీపడిన ఈ పరీక్షలో అత్యధిక సంఖ్యలో నారాయణ విద్యార్థులు విజయదుందుభి మోగించారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ పి. సింధూర నారాయణ మాట్లాడుతూ.. అనితర సాధ్యమైన శిక్షణ, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, మైక్రోషెడ్యూల్, బెస్ట్ స్టడీమెటీరియల్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ర్యాంకింగ్ సిస్టమ్, టాప్ ఫ్యాకల్టీతోనే ఇంతటి ఘనవిజయానికి కారణాలని తెలిపారు. 8వ తరగతి నుంచే జేఈఈకి అవసరమైన శిక్షణ అందించటంతోపాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు.

ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. డైరెక్టర్ శరణి నారాయణ మాట్లాడుతూ.. ఎన్-లెర్న్ యాప్ ద్వారా ఛాప్టర్ వైజ్ ప్రాక్టీస్ టెస్టు, ఆన్‌లైన్ మాక్ టెస్ట్లు నిర్వహించటం వల్లనే నారాయణ విద్యార్థులు ఇంతటి ప్రతిభాపాఠవాలను ప్రదర్శించగలిగారని తెలిపారు.

టాప్ ర్యాంకులు సాధించిన వారికి అత్యధిక సంఖ్యలో నారాయణ స్కూల్‌లో చదివిన విద్యార్థులే ఉన్నార న్నారు. ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి నారాయణ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత్ కొత్తప అభినందనలు తెలిపారు.