calender_icon.png 1 October, 2025 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

01-10-2025 09:48:37 AM

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ(Medigadda), అన్నారం(Annaram), సుందిళ్ల(Sundilla) ఆనకట్టల పునరుద్దరణ డిజైన్లకు కసరత్తు మొదలుపెట్టింది. డిజైన్ల తయారీకి కన్సల్టెన్నీల కోసం ఆసక్తి వ్యక్తీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీటిపారుదలశాఖ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(Central Designs Organization of Irrigation Department) ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సీడీవో ప్రముఖ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను స్వీకరించనుంది. ఆసక్తి వ్యక్తీకరణను నీటిపారుదలశాఖకు ఇచ్చేందుకు ఈనెల 15 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించింది. కేసీఆర్ లక్ష కోట్ల ప్రజాధనం మింగి పనికిరాని ప్రాజెక్టు కట్టిపోతే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల డబ్బుతో కట్టిన ప్రాజెక్టును బాగుచేసి ప్రజలకు అందించే చర్యలు చేపట్టినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.