కుమ్మెర జాతరలో కొబ్బరికాయల పంచాయితి
- అక్రమంగా డబ్బులు వసూలు చేయడంపై ప్రశ్నించినందుకు భక్తుడిని చితకబాదిన వైనం
పోలీసులకు ఫిర్యాదు
నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గట్టు జాతరలో కొంతమంది వ్యక్తులు భక్తుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేయడంపై ప్రశ్నించినందుకు తిరిగి భక్తుడినే చిత కబాదారు. ఈ ఘటన బుధవారం రాత్రి చో టు చేసుకోగా గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన గణేష్ అనే భక్తుడు కుమ్మెర గట్టు మల్లన్న దర్శనం కో సం వెళ్ళాడు.
నాగర్ కర్నూల్ జిల్లాలో జరుగుతున్న మరిన్ని తాజా ఘటనల కోసం నాగర్ కర్నూల్ వార్తలు చదవండి
అక్కడ కొబ్బరికాయలు విక్రయించే వ్యక్తులు అదనంగా అక్రమంగా మ రో వంద రూపాయలు డబ్బులు వసూలు చేయడంపై రసీదు ఇవ్వాలని కోరినందుకు భక్తుడిని నిర్వాహకులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు.
రాష్ట్రం మరియు దేశవ్యాప్తంగా తాజా అప్‌డేట్స్ కోసం మా విజయక్రాంతి న్యూస్ హోమ్‌పేజీని సందర్శించండి
కొబ్బరికాయల దుకాణంలోనే బంధించి తీవ్రంగా పిడుగులు కురిపిస్తూ దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న మరి కొంతమంది భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్ర స్తుత వీడియో వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనలో గ్రామ సర్పంచ్ బంధువులే అక్ర మ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బ్రేకింగ్ అప్‌డేట్స్ మరియు ముఖ్య వార్తల కోసం మా లేటెస్ట్ న్యూస్ సెక్షన్‌ను ఫాలో అవ్వండి
ప్రశ్న: కుమ్మెర జాతర ఘటన ఏంటి?
జవాబు: అక్రమ వసూళ్లపై ప్రశ్నించిన భక్తుడిపై దాడి జరిగింది.






