15-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): రానున్న రెండు, మూడు రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శీతల గాలులు వీస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసీఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో అక్కడక్కడ శీతల గాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరించింది. సాధారణం కంటే 3 నుంచి 4 సెంటీగ్రేడ్ వరకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.