calender_icon.png 15 November, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలి

14-11-2025 11:57:08 PM

పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్లా ఆంజనేయులు

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ సాధనలో భాగంగా చేపడుతున్న ఆక్రోశ సభను విజయవంతం చేయాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్లా ఆంజనేయులు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 42 శాతం బీసి రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో నవంబర్  ఈ నెల 15న మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డిలోని సత్య ఫంక్షన్ హాల్ (కన్వెన్షన్ సెంటర్‌)లో బీసీ ఆక్రోశ సభ జరుగుతుందన్నారు.

జిల్లా నుండి బీసీ వర్గాలలో నీ అన్ని కులాలు అత్యధిక సంఖ్యలో తరలివచ్చే జయప్రదం చేయాలని కోరారు. రాజకీయ పార్టీలు బీసీలకు ఇచ్చిన హామీల అమలు, వైఫల్య మోసాల పై ఈ సభలో బీసీ వర్గాలు ఆక్రోశం వ్యక్తం చేనునట్టు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ బంధువులు,పద్మశాలి సమాజం కూడా అధిక సంఖ్యలో బిసి ఆక్రోశ సభను  విజయవంతం చేయడం ద్వారా మూడు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి 42 శాతం రిజర్వేషన్లు,  సాధించుకుందామని స్పష్టం చేశారు.