calender_icon.png 15 November, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

14-11-2025 11:59:08 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో నిర్మితమైన ప్రభుత్వ పాఠశాల కొత్త భవనాన్ని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ కె. నిత్యానంద రెడ్డి, డైరెక్టర్ పి. శరత్ చంద్ర రెడ్డి ముఖ్యంగా హాజరయ్యారు. అత్యాధునిక వసతులతో నిర్మించిన ఈ పాఠశాల భవనం గ్రామ విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. గ్రామాల్లో విద్యా వసతుల అభివృద్ధి భవిష్యత్ తరాలకు అత్యంత ప్రాముఖ్యమైందని పేర్కొన్నారు.

గ్రామ అభ్యున్నతికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కూచుకుళ్ల ఫౌండేషన్ ద్వారా పాఠశాలకు గ్రీన్ బోర్డ్స్ అందజేయడం జరిగిందన్నారు. పాఠశాల పరిసరాల్లో విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు త్వరలో ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. అనంతరం స్వతంత్ర భారత రూపశిల్పి, తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మాజీ సర్పంచ్ అమృత్ రెడ్డి, తిరుపతయ్య, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.