calender_icon.png 13 July, 2025 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం

13-07-2025 12:13:41 AM

  1. ఢిల్లీలోని శీలంపూర్‌లో ఘటన
  2. ఆరుగురు మృతి.. 8 మందికి గాయాలు
  3. కొనసాగుతున్న సహాయక చర్యలు

న్యూఢిల్లీ, జూలై 12: ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని శీలంపూర్ ప్రాంతం లో ఉన్న జనతా మజ్దూర్ కాలనీలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భవనంలో నివాసముంటున్న వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. సమాచారం అం దుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగాయి.

సహాయక చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స మీప ఆసుపత్రికి తరలించారు. భవనం శిథిలాల్లో 12 మంది వరకు చిక్కుకున్న ట్టు తెలుస్తోంది. శిథిలాల నుంచి వెలికి తీసిన మృతదేహాలను జీటీబీ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలి పారు. ‘ఉదయం ఏడు గంటలకు భవ నం కూ లిపోయినట్లు మాకు కాల్ వచ్చింది.

ఏడు అగ్నిమాపక దళాలు సహా బహుళ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. పూర్తి వివరాలు  వెల్లడించేందుకు సమయం పట్ట నుంది’ అని ఒక అధికారి పేర్కొన్నారు. కాగా భ వనం కుప్పకూలుతున్న వీడియోను ఒక వ్యక్తి సామాజిక మాధ్యమం లో షేర్ చే శారు. నాలుగు అంతస్తుల బిల్డింగ్ పేక మేడలా కుప్పకూలి పక్కనే ఉన్న ఇళ్లపై పడింది. దీంతో ఆ ఇళ్లు కూడా  బాగా దె బ్బతిన్నాయి. స్థానికులు పెద్ద ఎత్తున స హాయక చర్యల్లో పాల్గొన్నారు.