calender_icon.png 13 July, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోట శ్రీనివాసరావుకు నివాళులర్పించిన చిరంజీవి

13-07-2025 12:52:40 PM

హైదరాబాద్: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు భౌతిక గాయానికి  మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. నటుడి అంత్యక్రియల్లో చిరంజీవి కూడా ఆయనకు నివాళులర్పించారు. రావు భౌతికకాయంపై ఎర్ర గులాబీల పుష్పగుచ్ఛం ఉంచారు. ఆయన చిత్రపటం ముందు తల వంచి నమస్కరించి నటుడి బంధువులు, కుటుంబ సభ్యులను కలిశారు. ఈసందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... మహానటుడు కోట శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరమన్నారు. సుదీర్ఘ నటప్రస్థానంలో కోటతో చాలా అనుబంధం ఉందని, ఆయనతో నటించిన ప్రతి సినిమా తనకు ప్రత్యేకం అని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

కోట శ్రీనివాసరావు మృతి సినీపరిశ్రమను తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి చేకుఱాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని చిరు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జి.  కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి పలువురు నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు, ఆంధ్ర బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ కూడా ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.

ప్రముఖ తెలుగు నటుడు, మాజీ బిజెపి ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు(83) ఆదివారం హైదరాబాద్‌లో వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా కన్నుమూశారు. చిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, చాలా సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న రావు ఈ రోజు తెల్లవారుజామున తన నివాసంలో తుది శ్వాస విడిచారు.