calender_icon.png 13 July, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోట మృతి పట్ల గుత్తా, కోమటిరెడ్డి సంతాపం

13-07-2025 01:24:03 PM

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు మృతి పట్ల  శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రోడ్లు భవనములు, సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం వేరువేరు ప్రకటనలతో సంతాపం ప్రకటించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం  తెల్లవారుజామున 4 గంటలకు ఆయన ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల తన సినీ కెరీర్ లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఆయన 750కి పైగా సినిమాల్లో నటించారు. కోట శ్రీనివాస రావు ఆహ నా పెళ్లంట సినిమాతో తిరుగులేని నటుడిగా కొనసాగారు ప్రతి ఘటన సినిమాతో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. వారు మృతి చెందడం సినిమా ఇండస్ట్రీస్ కి తీరని లోటు అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.