13-07-2025 12:11:11 AM
వాషింగ్టన్, జూలై 12: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు సుంకాల బాంబ్ ప్రయోగించారు. మెక్సికో, యురోపియన్ యూనియన్‌లోని దేశాల నుంచి అమెరికాకు వచ్చే ఉత్పత్తులపై 30 శాతం మేర సుంకాలు విధిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాకు మెక్సికో, యురో పియన్ యూనియన్లు అతిపెద్ద భాగస్వాములుగా ఉన్నాయి. ఈ సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లియెన్, మెక్సికో అధ్యక్షురాలు షీన్‌బామ్‌లకు లేఖలు కూడా రాశారు. 40 శాతం కంటే ఎక్కువగా సుంకాలు వేస్తున్న దేశాలకు ట్రంప్ సోమవారం నుంచి లేఖలు రాయనున్నారు.