13-07-2025 12:15:37 AM
16వ రోజ్‌గార్ మేళా సందర్భంగా ప్రధాని మోదీ
51వేల మందికి నియామక పత్రాల పంపిణీ
న్యూఢిల్లీ, జూలై 12: భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు యువతే మూలధనం అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం జరిగిన 16వ రోజ్ గార్ మేళాలో 51వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ప్రసంగిం చారు. ‘భారత్‌లో జనాభా, ప్రజాస్వామ్యం అనే రెండు అపారమైన శక్తులు ఉన్నాయని ప్రపంచం అంగీకరిస్తోంది.
అంటే అతిపెద్ద యువ జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం. యువత బలం దేశానికి మూలధనం. ఈ మూలధనాన్ని శ్రేయ స్సు కోసం ఒక సూత్రంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని అన్నారు. ఇటీవలే ఐదు దేశాల్లో కుదిరిన ఒప్పందాలు యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని నొక్కి చెప్పారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. 16వ ఎడిషన్ రోజ్‌గార్ మేళాతో మొత్తం నియామకాల సంఖ్య 10 లక్షలకు చేరింది.