20 March, 2026 | 6:16 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

కేయూ పోతన హాస్టల్లో కూలిన పైకప్పు

13-07-2024 01:35 AM

తప్పిన ప్రమాదం

హనుమకొండ, జూలై 12 (విజయక్రాంతి):: కాకతీయ వర్సిటీ (కేయూ)లో శుక్రవారం రాత్రి ఓ గది పైకప్పు పెచ్చులూడి కిందపడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కేయూలోని పోతన హాస్టల్ పరిధిలోని 94వ గదిలో శుక్రవారం రాత్రి విద్యార్థినులు నిద్రిస్తున్నారు. ఈక్రమంలో ఒక్కసారిగా పైకప్పు పెచ్చులూడి కిందపడ్డాయి. దీంతో విద్యార్థినులు ఉలిక్కిపడి నిద్రలేచారు. ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవ ల ఇదే హాస్టల్‌లో సీలింగ్ ఫ్యాన్ ఊడి విద్యార్థినిపై పడింది. ఘటనలో ఆమె గాయాలపాలైం ది. అది మరువకముందే మరోఘటన చోటుచేసుకోవడంపై విద్యార్థులు మండిపడుతు న్నారు. వరుసగా ఘటనలతో విద్యార్థులు ఆగ్రహానికి గురై కేయూలో ఆందోళన చేపట్టారు.