27-11-2025 02:06:30 PM
విద్యుత్ ఉత్పత్తి భారం.
హిల్ట్ పాలసీ వల్ల ప్రభుత్వానికి ఆదాయం.
విద్యుత్ ప్లాంట్ పై అవాస్తవాలు ప్రచారం.
ప్రతిపక్షల్లో ప్రభుత్వాన్ని తప్పుపట్టాలనే ధోరణి.
హైదరాబాద్: నగరంలోని పరిశ్రమలు ఓఆర్ఆర్(ORR) వెలుపలకు తరలించాలనేది తమ ప్రణాళిక అనిమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. హిల్ట్ పాలసీ ఎన్నో రకాలుగా ప్రయోజనకరమని ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. హిల్ట్ పాలసీ వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందన్నారు. వచ్చే ఆదాయాన్ని సంక్షేమ, అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని తెలిపారు. ఏం చేసినా ప్రభుత్వాన్ని తప్పు పట్టాలనే ధోరణి ప్రతిపక్ష నేతల్లో కనిపిస్తోందని ఆరోపించారు.
కొత్తగా చేపట్టే థర్మల్ విద్యుత్ ప్లాంట్ పై కూడా అవస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం నిర్మించాల్సిన విద్యుత్ ప్లాంట్ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి విద్యుత్ ప్లాంట్(Bhadradri Power Plant) నిర్మాణాన్ని కాలం చెల్లిన పద్ధతిలో గత ప్రభుత్వం చేపట్టిందన్నారు. సబ్ క్టిటికల్ పద్ధతి వల్ల ఆర్థికంగా పర్యావరణంపరంగా తీవ్రవైన నష్టం జరిగిందన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ ను పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి కూడా భారంగా మారిందన్నారు. ఛత్తీస్ గఢ్(Chhattisgarh) నుంచి చేసిన విద్యుత్ కొనుగోళ్లలోనూ అవకతవకలు జరిగాయని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ఇంకా మంజూరు చేయని, నిర్మాణం జరగని విద్యుత్ ప్లాంట్ లో అవినీతి ఎలా జరుగుతోందని ఉత్తమ్ ప్రశ్నించారు.