27-11-2025 01:49:18 PM
మాజీ సర్పంచ్ హత్య కేసులో 10 మంది అరెస్ట్
నందిన్నె మాజీ సర్పంచ్ చిన్నభీమరాయుడి హత్య
హైదరాబాద్: గద్వాల జిల్లాలో(Jogulamba Gadwal District) మాజీ సర్పంచ్ హత్య కేసును పోలీసులు(Police) ఛేదించారు. నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్(Former Sarpanch of Nandinne village) చిన్నభీమరాయుడు హత్య జరిగింది. ఈనెల 21న బైకుపై వెళ్తున్న భీమరాయడిని బొలేరు వామనం ఢీకొట్టింది. సుపారీ ఇచ్చి భీమరాయుడిని ప్రత్యర్థులు హత్య చేయించారు. మాజీ సర్పంచ్ హత్య కేసులో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. భీమరాయుడి హత్యకు రూ. 25 లక్షలకు సుపారీ గ్యాంగ్ ఒప్పందం చేసుకుంది. కర్నూలు సుపారీ ముఠా నుంచి రూ. 8.50 లక్షలు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మిల్లు వీరన్న అనే వ్యక్తి సుపారీ ముఠాకు రూ. 15 లక్షలు ఇచ్చినట్లు గుర్తించారు. బియ్యం వ్యాపారంపై ఫిర్యాదు చేశాడే భీమరాయుడిని చంపించినట్లు పోలీసులు విచారణలో తెలింది.