calender_icon.png 7 June, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 20వ తేదీలోపు కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల అధ్యక్షుడు జాబితా సేకరణ

05-06-2025 07:28:06 PM

2017కు ముందు నుండి ఉన్న వారికి ప్రాధాన్యత..

ప్రస్తుతం పనిచేస్తున్న వారి పనితీరు సరిగా ఉంటే పరిశీలన..

వలిగొండ (విజయక్రాంతి): ఈనెల 20వ తేదీ లోపు కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల అధ్యక్ష ఆశావాహుల జాబితా సేకరణ చేపట్టనున్నారు. ఈ జాబితాలో అన్ని సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకొని నూతన అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. జాబితా నుండి చివరకు ఐదు పేర్లు టీపీసీసీకి అందజేయాల్సి ఉంటుంది. అనంతరం టిపిసిసి ఆదేశాల మేరకు గ్రామ, మండల అధ్యక్షుడు ఎంపిక జరగనుంది. అయితే 2017 కు ముందు నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారికే గ్రామ, మండల అధ్యక్షుల ఎంపికలు ప్రాధాన్యత ఇవ్వాలని టీపీసీసీ సూచించడం జరిగింది.

దీంతో 2017 తర్వాత పార్టీలోకి చేరిన వారికి గ్రామ, మండల అధ్యక్ష పదవులపై ఆశ పెట్టుకున్న వారికి నిరాశే మిగిలే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రస్తుతం గ్రామ, మండల అధ్యక్షులుగా పనిచేస్తున్న వారి పనితీరు మెరుగుగా ఉంటే మరోసారి వారి పేర్లను పరిశీలించే అవకాశం ఉండడంతో ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో మరోసారి అవకాశం వస్తుందని ఆశలు చిగురించాయి. మొత్తానికి వచ్చే రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో గ్రామ, మండల అధ్యక్షుల పదవుల ఎంపికను పూర్తి చేసి ఉత్సాహంతో ఎన్నికల సమరంలోకి దిగేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధమైంది.