సింగరేణి ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరచాలి..
05-06-2025 07:30 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): సింగరేణిలో వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ ముందు నిరసన దీక్ష చేపట్టి డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు(Director Koppula Venkateswarlu) వినతిపత్రం అందజేశారు. దాని ప్రతిని బెల్లంపల్లి ఏరియా డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మధు కుమార్(Deputy Chief Medical Officer Madhu Kumar)కి గురువారం బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో టీబిజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్ రాజ్ శ్రీనివాసరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ నాయకులు అనుముల సత్యనారాయణ, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి రవుఫ్,సభ్యులు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






