6 July, 2026 | 9:09 PM

Breaking News

ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •   ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష   •   రేబిస్ వ్యాధి నివారణకు చేయి చేయి కలుపుదాం   •   అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన గౌతమ బుద్ధ స్వచ్ఛంద సేవా సంస్థ   •  

సిర్పూర్‌లో ఎమ్మెల్యే బంధువుల వసూళ్ల దందా

27-06-2024 01:05 AM
  • పోలీసులకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఫిర్యాదు

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్26 (విజయక్రాంతి): సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు కుటుంబ సభ్యులు, బంధువులు వసూళ్లకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం నాయకులు, రైతుల తో కలసి డీఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా ఉన్న పాల్వాయి అందవెల్లి బ్రిడ్జి కొట్టుకుపోతే ధర్నా నిర్వహించడం విడ్డూరంగా ఉన్నదన్నారు.

పాల్వాయి బాబాయి సుధాకర్‌రావు అరాచకలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని చెప్పారు. కేసులు పెడుతూ, భూకబ్జాలు చేస్తూ, ట్రాక్టర్ యజమానులు, ఫర్టిలైజర్ వ్యాపారుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోడు రైతులను ఉసిగొల్పి వారిపై కేసులు నమోదయ్యేలా చేస్తున్నారన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధాల దేవయ్య, ఎంపీపీ నానాయ్య, జెడ్పీటీసీ డబ్బుల వెంకన్న తదితరులు ఉన్నారు.