చిత్రాలకు జీవం పోస్తున్న కళాకారిణి ఉదయ శ్రీ
చిన్నారి కళాకారిణిని ప్రశంసించిన కలెక్టర్, ఎమ్మెల్యే
మణుగూరు, డిసెంబర్29,(విజయక్రాంతి): చిత్రాలకు రూపం ఇస్తూ ఓ చిన్నారి కళాకారిణి గీస్తున్న చిత్రాలు అబ్బురప రుస్తున్నాయి. ఆమె మేధసు తో గీస్తున్న చిత్రాలు కళ సృజనకు నిలువుటద్దాలుగా నిలుస్తున్నాయి. ఆ చిత్రాలు మదిలో మెదిలే ఊహలకు అద్భుత రూపాన్నిఇవ్వడంలో ఆమె శైలి ఓ ప్రత్యేకతను సంతరిం చుకుంది. మండలంలో కొండాయిగూడెం గ్రామానికి చెందిన దాచేపల్లి శ్రీను కుమార్తె ఉదయశ్రీ ఓవైపు చదువుతోపాటు చిత్రలేఖనంలో కూడా ప్రతిభ చూపుతు న్నారు. పెన్ను, పెన్సిల్, కుంచె ఇలా చేతికి దొరికిన వస్తువుతో కాన్వాస్ పై ఆకట్టు కునే చిత్రాలు గీస్తున్నారు. జీవకళ ఉట్టిపడేలా ఉదయ్ శ్రీ గీస్తున్న ఈ అద్భుత చిత్రాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.
ఆమెకు చిన్నప్పటి నుండి చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. వ్యవసాయ కుటుంబ నేపథ్యం అయినప్పటికీ చిత్రకళపై ఇష్టం పై పట్టుబట్టి మరీ నేర్చుకున్నారు. అనేక రకాల చిత్రాలు గీసి ఇప్పటికే శభాష్ ఉదయశ్రీ అని అనిపించుకున్నారు. తాజాగాభద్రాచలం ముక్కోటి ఉత్సవాల నేపథ్యంలో గోదారిఘాట్ వద్ద నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాలలో సీతారామ చంద్రస్వామిని చిత్రించి అందరిని ఆకట్టు కుంటున్నారు. రాములోరి చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఆమె కళను జిల్లా కలెక్టర్ జితేష్ వి పా టిల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఉదయ్ శ్రీ చిత్ర కళపై ఆసక్తి ఎక్కువ నిరంతర సాధనతో మరింత దూసుకెళ్తున్నారు.






