15 April, 2026 | 5:49 AM

గోవా టూర్‌లో విషాదం

30-12-2025 01:20 AM
  1. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

ఒకరి పరిస్థితి విషమం

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో విషాదం

సంగారెడ్డి, డిసెంబర్ 29 (విజయక్రాంతి): గోవా టూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. గోవాకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా మరి కొందరు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన 15 మంది యువకులు మూడు వాహనాల్లో గోవా టూర్‌కు వెళ్లారు.

సరదాగా గడిపి సోమవారం తిరిగి వస్తుండగా మహారాష్ట్రలోని సోలాపూర్ సమీపంలోకి రాగానే ఒక వాహనం కారు టైర్లు పగిలిపోయి బోల్తా పడింది. దాంతో అందులో ప్రయాణిస్తున్న రిహాన్, పవన్‌కుమార్ ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందాడు. కమ్రుద్దీన్ అనే యువకుడు తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నాడు. మరికొంతమందికి  స్వల్ప గాయాలయ్యాయి.