2 May, 2026 | 2:29 AM

ఉజ్వల భవిష్యత్తుకు ‘బాల భరోసా’ ఒక వరం

02-05-2026 01:13 AM

కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం, మే 1, ( విజయక్రాంతి):  చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బాల భరోసా పథకం ఒక వరం లాంటిదని కలెక్టర్ అంకిత్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రామవరంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం లో జిల్లా సంక్షేమ అధికారిణి జె. స్వర్ణలత లేనినా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ‘బాల భరోస‘ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని  మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా, వారి ఎదుగుదలలో తలెత్తే లోపాలను తొలిదశలోనే గుర్తించి నివారించేందుకు 99 రోజుల ప్రజా ప్రణాళిక లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బాల భరోసా’  కార్యక్రమం జిల్లా మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గతవారం రోజులుగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి అవగాహన పెంపొందిస్తున్నారన్నారు.

న్యూరో డెవలప్మెంట్ (నాడీ వ్యవస్థ సంబంధిత) సమస్యలు,శారీరక ఎదుగుదల లోపాలు,   మానసిక వికాసంలో ఆలస్యంవంటి అంశాలను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా *వారికి మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ 0 నుండి 5 సంవత్సరాల పిల్లలు అందిస్తున్న సేవలను మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని సిబ్బందిని అడిగి తెలుసుకుని,మెరుగైన సేవలు అందించాలని, మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని ప్రతి* విభాగాన్ని పరిశీలించి సూచనలు జారీ చేయడం జరిగింది. 

‘బేటి బచావో‘ కార్యక్రమంలో భాగంగా ‘భేటీ జన్మోత్సవ్‘నిర్వహించి నెలలోపు జన్మించిన ఆడపిల్లలకు బేటి జన్మోత్సవ్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో  వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది డాక్టర్ ప్రతాప్, డాక్టర్ వినోద్, నాగభూషణం, పీడియాట్రిషన్ డాక్టర్లు, జిల్లా స్థాయి ఆర్బిఎస్కే సిబ్బంది, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ జిల్లా సమన్వయకర్త పి. సంపత్, సిడిపివోలు లక్ష్మీ ప్రసన్న, వెంకటరమణ, సూపర్వైజర్లు ,అంగనవాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.