31 March, 2026 | 4:18 AM

వీవీప్యాట్లలో సింబల్ లోడింగ్ త్వరగా చేయాలి

06-05-2024 12:10 AM

ఆర్డీవో, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (విజయక్రాంతి) : హైదరాబాద్ పార్లమెంట్ నియోజ కవర్గం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల సింబల్‌లను వీవీప్యాట్‌లలో ఆదివా రం రాత్రిలోగా లోడింగ్ పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. చాంద్రాయణగుట్ట, గోషామహల్, చార్మినార్, యాకత్‌పుర, కార్వాన్, బహదూర్‌పుర, మలక్‌పేట డీఆర్సీ సెంటర్లను ఆదివారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సెగ్మెంట్లలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను వేరు (సెగ్రిగేషన్) చేసే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. డీఆర్సీ కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందికి తాగునీళ్లు, మజ్జిగ అందజేయాలన్నారు.