పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సీగా జియావుద్దీన్
జీహెచ్‌ఎంసీ ఈఎన్‌సీగా అదనపు బాధ్యతలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (విజయక్రాంతి) : జీహెచ్‌ఎంసీలో ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సి)గా పనిచేస్తున్న జియాఉద్దీన్ రాష్ట్ర మున్సిపల్‌శాఖ పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సిగా నియమితులయ్యారు. రాష్ట్ర మున్సిపల్‌శాఖ పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సిగా పనిచేసిన శ్రీధర్ రిటైర్మెంట్ కావడంతో జీహెచ్‌ఎంసీలో ఈఎన్‌సిగా పనిచేస్తున్న జియాఉద్దీన్‌కు పదోన్నతి కల్పిస్తూ పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సిగా పోస్టింగ్ కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సిగా జియాఉద్దీన్ బాధ్యతలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీలో ఖాళీ అయిన ఈఎన్‌సి పోస్టుకు ఇంకెవరిని నియమించలేదు. దీంతో జీహెచ్‌ఎంసీలో కూడా బాధ్యతలను చూడాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఈ పూర్తి చేసిన జియాఉద్దీన్ 1987లో ఏపీపీఎస్సీ ద్వారా డిప్యూటీ ఇంజినీర్‌గా నియాకమయ్యారు. ఈఈగా, ఎస్‌ఈగా పలు ప్రాంతాల్లో పనిచేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణంలో చీఫ్ ఇంజినీర్‌గా డిప్యూటేషన్‌పై పనిచేశారు. 37సంవత్సరాల సర్వీసులో అనేక అవార్డులను పొందారు. 2003లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఇంజినీర్ అవార్డుతో ఘనంగా సత్కరించింది. జీహెచ్‌ఎంసీలో నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ సూచనల మేరకు వినూత్న పథకాలు రూపొందించి అమలు చేశారు.




