calender_icon.png 20 February, 2026 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంప్యూటర్లు అందించడాన్ని అభినందించిన కలెక్టర్

20-02-2026 07:23:36 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సామాజిక బాధ్యతలలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించేందుకు సింగరేణి సంస్థ ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సింగరేణి గోలేటి జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డితో కలిసి, జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న నాలుగు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కంప్యూటర్లు, సిపియులు, ప్రింటర్లు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యతలలో భాగంగా సింగరేణి సంస్థ 11 కంప్యూటర్లు, 11 సిపియులు, 5 ప్రింటర్లు అందించడం సంతోషకరమని తెలిపారు. భవిష్యత్తులో పాఠశాలల మౌలిక వసతుల కల్పనలోనూ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ప్రణాళిక సమన్వయకర్త ఆబిద్ అలీ తదితరులు పాల్గొన్నారు.