నాగపురివాడలో నూతన బోరింగ్ ప్రారంభం
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం రాజంపేట గ్రామపంచాయతీ పరిధిలోని టీఆర్ నగర్ సమీపంలోని నాగపురివాడలో సుదీర్ఘకాలంగా నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నూతన బోరింగ్‌ను శుక్రవారం గ్రామ సర్పంచ్ బుర్సా పోచయ్య, జిల్లా వార్డు మెంబర్ ఫోరం అధ్యక్షుడు, వార్డు సభ్యుడు గులాం జావీద్, ఉపసర్పంచ్ మామిడి లక్ష్మి, వార్డు సభ్యులు బొట్టుపెల్లి లావణ్య, ప్రశాంత్, జాబారి కిషోర్, కుంరం వేణు, పంచాయతీ కార్యదర్శి సాయి కృష్ణ, బీసీ నాగేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బుర్సా పోచయ్య మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ప్రాంతానికి మౌలిక వసతులు కల్పించడమే పాలకవర్గం లక్ష్యమని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే దిశగా గ్రామపంచాయతీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.






