22 July, 2026 | 8:47 PM

Breaking News

తహసిల్దార్ భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

22-07-2026 07:44 PM

కుబీర్,(విజయక్రాంతి): బాసర మండల కేంద్రంలో నూతనంగా నిర్మించి తహసిల్దార్ భవన నిర్మాణం స్థలాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం పరిశీలించారు. ప్రభుత్వం గుర్తించిన స్థలాన్ని పరిశీలించి సర్వేనెంబర్ విస్తీర్ణం ఇతర వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తాసిల్దార్ భవనాలకు నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో భవన నిర్మాణం పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పవనచంద్ర అధికారులు ఉన్నారు.