22 July, 2026 | 9:47 PM

సొసైటీ డైరెక్టర్ గా శ్రీకాంత్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి

22-07-2026 08:42 PM

మేడ్చల్,(విజయక్రాంతి): షామీర్పేట్ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ గా మాచన్నగారి శ్రీకాంత్ రెడ్డి కి అవకాశం ఇవ్వాలని జిల్లా రైతు సమైక్య సభ్యులు అభిప్రాయపడ్డారు. కలెక్టరేట్లో జిల్లా అధ్యక్షుడు ముద్దం సంజీవరెడ్డి అధ్యక్షతన జిల్లా రైతు సమైక్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులందరూ శ్రీకాంత్ రెడ్డి పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. శ్రీకాంత్ రెడ్డి కి రైతు సమస్యలపై అవగాహన ఉందని, రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. అంతేగాక రైతులందరినీ ఐక్యంగా ఉంచుతారన్నారు.