22 July, 2026 | 9:27 PM

సేంద్రీయ సాగుపై రైతులతో ముఖాముఖి

22-07-2026 08:25 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా సేంద్రీయ సాగుపై రైతులతో బిజెపి నేతలు బుధవారం ముఖాముఖి నిర్వహించారు. నేత మహేశ్వర్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి చంద్రశేఖర్ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులతో మాట్లాడారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సేంద్రియ సాగులో ఎదురవుతున్న సమస్యలు, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, ప్రభుత్వ ప్రోత్సాహంపై చర్చించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావుతో పాటు, జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, సేంద్రియ వ్యవసాయం చేస్తున్న పలువురు రైతులు పాల్గొన్నారు.