4 May, 2026 | 3:22 PM

Breaking News

ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •  

డిచ్ పల్లి సి.హెచ్.సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

09-08-2025 05:58 PM

తహసీల్దార్ కార్యాలయం సందర్శన..

నిజామాబాద్ (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) సూచించారు. శనివారం ఆయన డిచ్పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషంట్, ఫిమేల్, జనరల్ వార్డులు, ల్యాబ్ తదితర విభాగాల పనితీరు పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. ప్రతి రోజు ఎంత మంది పేషంట్లు వస్తున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు.

అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో పని చేయాలని హితవు పలికారు. రౌండ్ ది క్లాక్ ఆసుపత్రులలో అన్ని సమయాలలో వైద్యులు, సిబ్బంది విధుల్లో ఉండాలని ఆదేశించారు. ప్రతీ నెల రెండవ శనివారం ప్రత్యేకంగా నిర్వహించే ఆరోగ్యశ్రీ శిబిరానికి అన్ని విభాగాల స్పెషలిస్టు డాక్టర్లు హాజరయ్యేలా చూడాలని, పీ హెచ్ సీ లు, సీ హెచ్ సీల పనితీరును ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ డిచ్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి తహసీల్దార్ సతీష్ రెడ్డిని ఆరా తీశారు. త్వరితగతిన అర్జీలు పరిష్కరించాలని సూచించారు.