09-08-2025 06:01:29 PM
చండూరు (విజయక్రాంతి): చండూరు మండల పరిధిలోని కస్తాల గ్రామానికి చెందిన గంతే కంపు విజయ్ కుమార్తె జ్యోతి(14) జూవైనల్ డయాబెటిస్ బాధపడుతుందని విషయం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి(MLA Rajgopal Reddy) దృష్టికి తీసుకుపోగా ఆ అమ్మాయికి ఎన్ని లక్షలు ఖర్చయినా నేనే భరిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమ్మాయి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.