10 April, 2026 | 7:42 PM

Breaking News

సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అవగాహన కార్యక్రమం   •   భవన నిర్మాణ కార్మికులకు కార్మిక భవన్ ఏర్పాటుకు సహకరిస్తా   •   విజయక్రాంతి ఎఫెక్ట్   •   రుద్రారం శివారులో అక్రమ ఇసుక టిప్పర్ సీజ్... ఒకరి అరెస్ట్   •   రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం   •   దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •  

చౌక ధరల దుకాణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

10-04-2026 06:08 PM

సన్నబియ్యం పంపిణీ పరిశీలన

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చౌక ధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్ లో ఉన్న చౌక ధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి.. ఆన్లైన్ లో లబ్దిదారుల వివరాల నమోదు .. సన్న బియ్యం పంపిణీని పరిశీలించారు. ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేయాలని ఇప్పటికే అన్ని చౌక ధరల దుకాణాలకు అందించింది. ఈ సందర్భంగా పలువురు రేషన్ కార్డుల లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ఇప్పటిదాకా ఎందరు లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకువెళ్ళారు? పంపిణీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రేషన్ డీలర్ ను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. పరిశీలనలో సిరిసిల్ల డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.