28 April, 2026 | 4:30 AM

అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

28-04-2026 01:30 AM

మేడ్చల్, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ మను చౌదరి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, వైద్య సేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రతిరోజూ ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు, మెడిసిన్ స్టోరేజ్ ఏరియాను తనిఖీ చేసిన కలెక్టర్, అక్కడ ఉన్న మందుల నిల్వలను పరిశీలించారు.

ముఖ్యంగా ట్యాబ్లెట్ల ఎక్స్పైరీ డేట్లను (గడువు ముగిసే తేదీలను) స్వయంగా తనిఖీ చేసి, నాణ్యమైన మందులు మాత్రమే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి వారికి కావాల్సిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు  సిబ్బందికి ఉపయోగపడే విధం గా అదనపు వాష్రూమ్ సౌకర్యం కల్పించాలని సిబ్బంది కలెక్టర్ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రతిపాదనలు పంపాలని, త్వరలోనే వాష్రూమ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట డిప్యూటీ తహసీల్దార్ అనూష, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.