ఇంటర్ విద్యార్థులను అభినందించిన కలెక్టర్
మహబూబాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డోర్నకల్ మైనారిటీస్ బాలికల ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులను బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్నేహ శబరీష్ మెడల్ అందజేసి, ప్రశంసా పత్రంతో సన్మానించినారు.
ఈ సందర్భంగా ఫలితాల సాధనకు కృషిచేసిన ప్రిన్సిపల్ దాసరి స్వప్న, అధ్యాపక బృందాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫర్ ఉమెన్ లో 1000 మార్కులకు గాను ఎస్కే హుమేరా 982, ఎస్.డి. రిజ్వానా 980, ఎం.నవ్య 972, సమీనా పటాన్ 970, ఎస్.కె రిజ్వానా 967, అదేవిధంగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో ఎస్.కె షరీఫా 979, ఎస్కే సుమయ్య 971 మార్కులను సాధించారు.
ఇక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 500 మార్కులకు గాను మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫర్ ఉమెన్ యందు ఎస్. కే రిజ్వానా 490, ఎస్. డి. సన 489, ఎస్కే ఆశ 484 , జెస్సికా 483 అదేవిధంగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో ఎస్.కె షాకీర 490, ఎస్. కే .సల్మా 490, ఎస్. డి. సభ 488 ,సాగరిక 486, ప్రసన్న 478 మార్కులతో కాలేజ్ టాపర్ గా నిలిచి కలెక్టర్ చేతుల మీదుగా అభినందనలను అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్ కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి బి. శ్రీనివాసరావు తో పాటుగా, కాలేజీ అకాడమీ కోఆర్డినేటర్ సరిత, డిప్యూటీ వార్డెన్ షహీన్, నజ్మా, ఎం.డి.ఇమాముద్దీన్ , ఏం.డి. అఖిల్లుళ్ల , ఎం.ఏ .వాజిద్, ఎస్.కె రజాలి, ఎం.డి. జాఫర్, ఎస్ .డి. అహ్మద్ , ఎస్.కె మహబూబ్, ఇక్బాల్, సత్తార్ , విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.






