22 July, 2026 | 8:21 PM

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పరిశీలన

22-07-2026 07:21 PM

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల,(విజయక్రాంతి): చందుర్తి మండలం మూడపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు కొనసాగుతుండగా, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ మ్యాప్ పరిశీలించి, ఏ ఏ నిర్మాణాలు ఎక్కడ చేస్తారో అడిగి తెలుసుకున్నారు. ఎప్పటిలోగా పూర్తి అవుతుందని ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కూలీల సంఖ్యను పెంచి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. 

మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

మూడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ఆవరణ లో వన మహోత్సవంలో భాగంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, తహసిల్దార్ భూపతి, ఎంపీడీఓ రాధ, సర్పంచ్ మల్లీశ్వరి, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.