22 July, 2026 | 8:07 PM

బాధితులకు భరోసాగా ఉంటాం

22-07-2026 07:36 PM

బైంసా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఏవైనా సమస్యలు ఉంటే పోలీస్ శాఖను సంప్రదిస్తే వారికి పూర్తి భరోసా భద్రత కల్పిస్తామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. బుధవారం బైంసా పట్టణంలో పోలీస్ ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా కుటుంబ సమస్యలను కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.