11-02-2026 06:58:01 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని మోడల్ పోలింగ్ కేంద్రాల్లో మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగా ఓటర్ నమోదు జాబితాలో పేర్లు నమోదు చేసుకొని ఓటు హక్కు వినించుకున్న నూతన ఓటర్లకు జిల్లా కలెక్టర్ సన్మానం చేశారు. కుటుంబ సమేతంగా మూడు తరాలతో కలిసి వచ్చిన ఓటర్లను శాలువాతో సన్మానించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వారితో కలెక్టర్ సెల్ఫీ ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ డి పి ఆర్ ఓ విష్ణువర్ధన్ అధికారులు ఉన్నారు.