15 April, 2026 | 1:40 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన కలెక్టర్

18-11-2025 12:00 AM

నారాయణపేట, నవంబర్ 17(విజయక్రాంతి) : కొడంగల్ నియోజకవర్గం గుండుమల్ గ్రామంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల ను కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. ( గృహ ప్రవేశం చేశారు.) ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పైలట్ గ్రామమైన ముదిరెడ్డి పల్లి కి మొత్తం 104 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, అందులో సోమవారం ఆరు ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించు కోవడం సంతోషంగా ఉందన్నారు. 

ఎలాంటి సమస్య ఉన్నా నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ లబ్ధిదారులందరికీ వాళ్ళ ఇండ్లను నిర్మించుకునేందుకు తోడ్పాటు అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో  గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయకుమార్, హౌసింగ్ పీడీ శంకర్, గుండుమల్ తహాసిల్దార్, ఎంపీడీవో, హౌసింగ్ ఏఈ, రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.