calender_icon.png 18 November, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతీయ వారసత్వ పరిరక్షణలో యువత కీలకం

18-11-2025 12:00:00 AM

న్యూఢిల్లీ ఇంటెక్ చైర్మన్ అశోక్ సింగ్ ఠాగూర్

మొయినాబాద్, నవంబర్ 17 (విజయ క్రాంతి): భారతీయ వారసత్వ పరిరక్షణలో యువత పాత్ర ఎంతో కీలకమైందని న్యూఢిల్లీ ఇంటెక్ చైర్మన్ అశోక్ సింగ్ ఠాగూర్ అన్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని అమ్దాపూర్ చౌరస్తా లోగల జేబీఆర్ ఆర్కిటెక్చర్ కళాశాలలో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇంటర్ చాప్టర్ 2025 ట్రెజరీ ఫస్ట్ స్పేరింగ్ ఫ్యూచర్ అని దీంతో నిర్వహించిన కార్యక్రమాన్ని జేబిఆర్ ఆర్కిటెక్చర్ కళాశాల చైర్మన్ ప్రొఫెసర్  గాయత్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన న్యూఢిల్లీ ఇంటెక్ చైర్మన్ అశోక్ సింగ్ ఠాగూర్ పాల్గొని ఆయన మాట్లాడుతూ.. యువత ఎంతో కీలకమని ఈ కార్యక్రమం యువతకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. చరిత్ర అధ్యయనంలో న్యూ మీ మ్యాటిక్స్ ప్రాధాన్యం ఎంతో సంతరించుకుంటుందని సూచించారు. నాగరికతల సాంస్కృతి ఆర్థిక వ్యవస్థ సామాజిక నిర్మాణం పరిపాలన పొందిన జీవితం వంటి అంశాలపై అనేక కీలక సమాచారాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. సాహిత్యం పురావస్తు ఆధారాలకు ఇవి పరిపూర్ణకరమని తెలిపారు.

భారత కథల వారసత్వం తరం నుంచి తరానికి అందించడానికి యువత కృషి చేయవలసిన అవసరం ఉందని తెలంగాణ స్టేట్ జ్యుడిషినల్ అకాడమీ మాజీ డైరెక్టర్ డాక్టర్ మంగారి రాజేందర్ అన్నారు. భారతదేశంలోని కథల సంపన్నమైన వారసత్వాన్ని క్లుప్తంగా వివరించారు.  ప్రాంతీయ పురావస్తు సమాజ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించిన సమగ్ర వార్షిక కార్యచరణ ప్రణాళికను రంగారెడ్డి జిల్లా యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తున్నామని ఇంటెక్ రంగారెడ్డి జిల్లా చాప్టర్ స్థాపక కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్జే గాయత్రి తెలిపారు.

ప్రణాళికలో భాగంగా హెరిటేజ్ వాకులు ఫీల్ ఎక్స్పో్ల రేషన్ విద్యార్థి హెరిటేజ్ క్లబ్బులు యువత భాగ్యసామ్యం డిజిటల్ డాక్యుమెంటేషన్ కార్యక్రమాలు కమ్యూనిటీ అవగాహన స్థానిక చరిత్ర పరిశోధన ఉంటాయన్నారు. రాష్ట్రాల మధ్య వారసత్వ సహకార విస్తరణ చేయడానికి తోడ్పడుతుందని తెలిపారు. ఇంటెక్ మాజీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఆర్. వేదకుమార్ మణికొండ మాట్లాడుతూ.. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఈ రాష్ట్రాలలో విస్తరించాలని ప్రతిపాదన చేశారని సూచించారు.

తద్వారా పురావస్తు పరిశోధనలు చరిత్రక ఆధారాలు అధ్యయనం వారసత్వ డాక్యుమెంటేషన్ సంయుక్త పరిరక్షణ సమన్వయం సాధించవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటెక్ తెలంగాణ కన్వీనర్ సబ్జాక్ సాహిత్, ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి, చాప్టర్ కో కన్వీనర్ ఆర్.జీ.సునీల్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.