28 June, 2026 | 3:11 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి: కలెక్టర్

17-03-2026 02:57 PM

* గాంధారిపల్లిలో ఫామాయిల్ సాగు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టంను పరిశీలించిన కలెక్టర్ ప్రతిమ సింగ్

* హెల్త్ క్యాంపును పరిశీలించి రోగులతో ముచ్చటించిన కలెక్టర్

పాపన్నపేట: పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆశాఖ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. మంగళవారం పాపన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపును ఆమె సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల సరళిని పరిశీలించి రోగులతో ముచ్చటించారు.

అనంతరం మండల పరిధిలోని గాంధారిపల్లిలో ఫామాయిల్ సాగు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టంను పరిశీలించారు. కలెక్టర్ వెళ్లిన అనంతరం జిల్లా వైద్యాధికారి శ్రీరాం హెల్త్ క్యాంపు ను పరిశీలించారు. మెదక్ డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్ వో హరిప్రసాద్, పాపన్నపేట మెడికల్ ఆఫీసర్ అన్వర్, గ్రామ సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.