30 June, 2026 | 9:50 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

కాలిపోయిన పంటలను పరిశీలించిన కలెక్టర్.. నష్టపోయిన రైతులకు భరోసా

06-05-2026 10:15 AM

బోథ్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండలం కనుగుట్ట గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో పంట నష్టపోయిన రైతుల భూములను మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్డీవో తాసిల్దార్లతో కలిసి సందర్శించారు. అగ్ని ప్రమాదాన్ని పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ రైతులతో మాట్లాడి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. విద్యుత్ శాఖ అధికారులు రైతుల సమక్షంలో సంఘటన గల కారణాలు ఏమిటనేది పరిశీలించి చలించి పోయారు.

రైతులు తాము పడుతున్న కష్టం చేతికందే దశలో కాలిపోయిన పంటల గురించి వివరిస్తుండగా ప్రశాంతంగా విన్నారు. దాదాపు మూడు కిలోమీటర్లు కాలిన మొక్కజొన్న చేలలో నుండి నడిచి వెళ్లి అగ్ని ప్రమాదానికి కారణమైన ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులను సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు... మాట్లాడుతున్న విద్యుత్ తీగల చూసి.... కాలిపోయిన పొలాల పొలాల లో నుండి వెళుతుండగా కలెక్టర్ వేలాడుతున్న విద్యుత్ తీగల చూసి ఇలా ఎందుకు ఉన్నాయి .వీటిని సరి చేస్తే ఏమవుతుంది, అనడంతో అక్కడున్న రైతులు సార్ నీటిని సరి చేయమని 100 సార్లు ఫోన్ చేశాం ఏఈ గారు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించలేదు.

చివరికి మా గతి గిట్లయింది అంటూ బాబు గారు. విద్యుత్ స్తంభల కోసం డీడీలు కట్టడం జరిగింది అది కూడా మూడు సంవత్సరాలయింది ఆయన మాకు జవాబు దొరకడం లేదు అని వాపోయారు.దీంతో కలెక్టర్ అసహనం వ్యక్తపరుస్తూ మీరు ఎప్పుడైనా విద్యుత్ స్తంభాలకు ఇండెంట్ పెట్టారా అని ఏ ఈ ని అడగగా నోటి మాట రాలేదు. రైతులు కరెంటు కష్టాలు సాగునీటి కష్టాలు తెలుపుతుంటే శ్రద్ధగా విని రైతులకు భరోసా ఇచ్చారు. విద్యుత్కు సంబంధించి మీ వ్యక్తిగత ఇబ్బందులు ఉంటే మీ గ్రామ సర్పంచ్ కు రాసి ఇవ్వండి. ఆ సమస్యను నేను పరిష్కరిస్తానంటూ రైతు లకు భరోసా ఇచ్చారు. ఇక తిరుగు ప్రయాణంలో పంటలు కోల్పోయిన మహిళా రైతులు కలెక్టర్కు వెదురుపడి ఏడవటంతో కలెక్టర్ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అమ్మ ఏడవకండి నష్టం అంచనాలు సిద్ధం చేసి పంపించాం పరిహారం వస్తుందంటూ ఓదార్చారు. జిల్లా కలెక్టర్ దాదాపు రెండు గంటల పాటు సమయాన్ని కేటాయించడం పట్ల రైతులు ఆనందం వ్యక్తపరిచారు.