20 April, 2026 | 5:36 PM

పదో తరగతి పబ్లిక్ పరీక్షల పాఠ్య మూల్యాంకన ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

20-04-2026 03:54 PM

హనుమకొండ,(విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షల నిర్వాహన అనంతరం జరిగే పేపర్ మూల్యాంకన కార్యక్రమాన్ని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు. నిర్వహణ విధానం, భద్రతా చర్యలు, పరీక్ష పత్రాల సంరక్షణ వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూల్యాంకనం పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, సమగ్రంగా,బాధ్యతతో పత్రాలను పరిశీలించాలని సూచించారు.

ఈ మూల్యాంకన ప్రక్రియను ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన  సిబ్బంది  నిర్వహిస్తున్నందున,  సమన్వయంతో, నిర్ణీత మార్గదర్శకాలకు అనుగుణంగా పనులను సమర్థవంతంగా కొనసాగించాలని సూచించారు. మూల్యాంకన కేంద్రంలో అవసరమైన సదుపాయాలు, పర్యవేక్షణ వ్యవస్థ, సమయపాలన వంటి అంశాలను కలెక్టర్ సమీక్షించారు. ఎటువంటి లోపాలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్ గౌడ్, ఎగ్జామినేషన్ అసిస్టెంట్ కమిషనర్  భువనేశ్వరి దేవి, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ నెహ్రు తదితరులు పాల్గొన్నారు.