6 March, 2026 | 1:55 PM

మహంకాళి జాతరకు ఆహ్వానం

06-03-2026 12:13 PM

వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ కె. హరిత 

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలోని స్వయంభు వెలసిన శ్రీ కనక దుర్గాదేవి, శ్రీ మహంకాళి దేవస్థానం ఆలయంలో జరగనున్న మహంకాళి జాతరకు(Mahankali jatara) జిల్లా కలెక్టర్ కె.హరితను ఆలయ ప్రధాన అర్చకుడు దేవర వినోద్ శుక్రవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాతర మహోత్సవ వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.

అర్చకుడు దేవర వినోద్ ఆలయ విశిష్టతతో పాటు జాతర కార్యక్రమాల వివరాలను కలెక్టర్‌కు తెలియజేశారు. ఏప్రిల్ 2న శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, ఏప్రిల్ 3న మహంకాళి జాతర మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతర సందర్భంగా బోనాలు, రథోత్సవం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర రాష్ట్రం నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకు తరలివచ్చే అవకాశం ఉందని అర్చకుడు వివరించారు.