25 August, 2026 | 3:44 PM

Breaking News

ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిశీలించిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్   •   వన మహోత్సవం వేళ చెట్ల నరికివేత   •   అవుట్‌డోర్ ఎలక్ట్రికల్ ఉద్యోగులకు కన్వీనియన్స్ వెహికల్ ఏర్పాటు చేయాలి   •   పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి   •   ఆల్ ఇండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడి గా గోవర్ధన్   •   ప్రకృతిని మనం నాశనం చేస్తే.... ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   ప్రకృతిని మనం నాశనం చేస్తేప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   సీతారాంపల్లి లో మొక్కలు నాటిన గ్రామ నాయకులు   •   నషాముక్త్‌ భారత్‌ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి   •   పంటల మార్పిడితోనే వ్యవసాయం లాభసాటి   •  

పోలీస్ శాఖలో 19 వేల ఉద్యోగాలివ్వాలి

05-07-2026 12:54 AM
  1. నిరుద్యోగుల డిమాండ్
  2. చిక్కడపల్లి సిటీ సెంట్రల్  లైబ్రరీ, దిల్‌సుఖ్‌నగర్‌లో నిరసన

ముషీరాబాద్/ఎల్బీనగర్, జూలై 4 (విజయక్రాంతి): ప్రభుత్వం 6 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులతో ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆమోదంతో నిరుద్యోగుల్లో గందరగోళం ఉందని నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి చిక్కడపల్లిలోని సిటీ సెంటర్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు నిరసనకు దిగారు. తాము రోజు 19 వేల ఖాళీలతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తే, ప్రభు త్వం మాత్రం 6వేల పోస్టులతో ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వడం అత్యంత  దారుణమన్నారు.

దీనికి మరింత పోస్టులు జోడించి 19 వేలతో నోటిఫికేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పోలీస్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు మెగా డీఎస్సీ, గ్రూప్స్ తదితర ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఐదు వేల పోలీస్ ఉద్యోగాలను నిరసిస్తూ దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు శనివారం మెరుపు ధర్నా చేపట్టారు. ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను సరూర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.

పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగులను ఎంట్రిన్ తాగి బావిలో దూకి చావమని వ్యాఖ్యానించడం సరైనది కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వేలాది మంది నిరుద్యోగులు రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి, వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.